Home » » ప్రేమలో పిచ్చిదైన త్రిష.. బాగానే పొడిపించుకుంది!

ప్రేమలో పిచ్చిదైన త్రిష.. బాగానే పొడిపించుకుంది!

Written By admin on Wednesday, 20 August 2014 | 00:57

ఇన్నాళ్లవరకు ‘‘నాకు ఎవరితోనూ ఎఫైర్ లేదు.  అంటూ చెప్పుకుంటూ వచ్చిన త్రిష బండారం ఇప్పుడు బయటపడిపోయింది. త్రిషకు కూడా బాయ్ ఫ్రెండ్స్ వున్నాడంటూ కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఇందుకు సాక్ష్యాలుగా  పచ్చబొట్ల ఫోటోలను కూడా చూపిస్తూ మరీ ‘‘త్రిష బాయ్ ఫ్రెండ్ దొరికిపోయాడంటూ’’ కథనాల మీద కథనాలు వెలువడుతున్నాయి. ఆ పచ్చబొట్లు మరెవరివో కాదు.. తమిళ హీరో ‘‘జయం’’ రవికి సంబంధించినవి! దీంతో వీరిద్దరి పీకల్లోతుదాకా ప్రేమలో మునిగిపోయారని.. ముఖ్యంగా త్రిష అయితే హద్దులుదాటి అతని ప్రేమలో మునిగిపోయిందని.. అందుకే ఈ పచ్చబొట్లను పొడిపించుకుందని వార్తలు షికార్లు చేస్తున్నాయి.


ఇక్కడో ముఖ్యమైన విషయం ఏమిటంటే... త్రిష కూడా ఈ విషయాన్ని అంగీకరించడం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. ‘‘నాకిప్పుడు బాయ్ ఫ్రెండ్ వున్నాడు.. అతనికోసం నా ఒంటిమీద ఎక్కడబడితే అక్కడ అతని ఫోటోను పచ్చబొట్లుగా పొడిపించుకున్నాను’’ అంటూ స్వయంగా తానే చెప్పుకోవడం అందరినీ షాక్ కు గురిచేసింది. కేవలం చెప్పడం వరకు మాత్రమే కాదు.. త్రిష పొడిపించుకున్న తన బాయ్ ఫ్రెండ్ ఫోటోలను సాక్షాలుగా చూపించి మరీ చెబుతోంది. దీంతో వీరి ప్రేమ వ్యవహారం నిజమేనని అనుకుంటున్న తరుణంలో.. చివరికి త్రిష కుండబద్ధలు కొట్టేసింది. ఆ పచ్చబొట్లు వెనుక వున్న అసలు రహస్యాన్ని ఈ అమ్మడు బయటపెట్టేసింది. ఇది రియల్ ప్రేమ కాదు.. రీల్ ప్రేమ మాత్రమే అంటూ అమ్మడు పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టేసింది.


0 comments:

Post a Comment